నటుడు రవితేజ తాజా సినిమా డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 24న విడుదలై మొదటివారం పూర్తిచేసుకుంది. మొదటి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీకి అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. మరి ఈ 7 రోజుల్లో డిస్కో రాజా వసూళ్లు ఎలా ఉన్నాయంటే … సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో వీఐ ఆనంద్ టేకింగ్, రవితేజ నటన ఆకట్టుందనే టాక్ వచ్చింది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ 7 రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ రన్ కొనసాగించాడు డిస్కో రాజా. మొదటి 7 రోజుల్లో డిస్కో రాజా ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయలు రాబట్టినట్లు రిపోర్ట్స్ అందాయి. మొదటి 6 రోజుల్లో 23 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సినిమా 7వ రోజు మరో 3 కోట్లు వసూలు చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో మొదటివారం వసూళ్లు 26 కోట్లుగా నమోదయ్యాయి.
టాలీవుడ్ లో రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలున్నాయి. పైగా డిస్కోరాజా మూవీ ఆయన కెరీర్‌లో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకోలేక పోతోంది డిస్కోరాజా మూవీ. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందిన డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహ కీలక పాత్ర పోషించాడు. చిత్రంలో రవితేజ నటనతో పాటు ఆ ముగ్గురు హీరోయిన్స్ నటన పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.