telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బర్త్ డే సందర్భంగా “రైడ్ విత్ సుశాంత్”… వీడియో వైరల్

sushanth

అక్కినేని హీరో సుశాంత్… ఇటీవల రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమైన ‘చి.ల.సౌ’ చిత్రంతో చాలా రోజుల తరువాత మళ్ళీ హిట్ అందుకున్నాడు. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. (నో పార్కింగ్) అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. మార్చి 18 సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘రైడ్ విత్ సుశాంత్’ పేరుతో టీజర్ లాంటి వీడియా ఒకటి రిలీజ్ చేశారు. సుశాంత్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. దర్శన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా సుశాంత్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

Related posts