telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్‌2 సర్‌ప్రైజ్‌ : యశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే..తాజాగా ఈ మూవీ నుంచి ఓ వార్త వైరల్‌ అవుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కేజీఎఫ్‌2 నుంచి సర్‌ ఫ్రైజ్‌ రాబోతుందట. జనవరి 8న 10:18 నిమిషాలకు ఈ చిత్ర టీజర్‌ విడుదల కానుంది. అదే రోజు యశ్ పుట్టిన రోజు. అందుకే బర్త్‌ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌ అందించనున్నారని టాక్‌. దీంతో యష్‌ ఫ్యాన్స్‌ మంచి ఖుషిలో ఉన్నారు.

Related posts