పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీపావళి పండగ పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు సినీ ప్రముఖులకు కానుకలు పంపారు. అందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఒకరు..ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి.
పవన్ తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్ పెట్టి మురిసిపోయింది. కానుకలు పంపినందుకు పవన్‌కు థ్యాంక్స్ చెప్పారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ..దర్శకులు డైరెక్టర్లు హరీశ్ శంకర్, క్రిష్‌కు కూడా గిఫ్టులు పంపారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తుండగా… త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.