telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత కుమారుడితో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమాయణం…!?

yakshi

నాలుగేళ్ల కింద 2016లో కేవలం 16 ఏళ్ళ వయసులోనే తమిళ ఇండస్ట్రీకి వచ్చిన యషికా ఆనంద్.. 2018లో బిగ్‌బాస్ సీజన్ 2తో గుర్తింపు తెచ్చుకుంది. అది జరుగుతున్నపుడే మీటూ క్యాంపెయిన్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసి నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది యషికా ఆనంద్. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నటుడు మహత్‌ రాఘవేంద్రను ప్రేమిస్తున్నట్టు చెప్పి సంచలనం రేపింది. కానీ ఆయన మాత్రం బయటికి వచ్చిన తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు యషిక ఓ నిర్మాత కుమారుడితో ప్రేమలో ఉందని తెలుస్తుంది. తమిళ నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో యషికా ఆనంద్ కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మణియార్ కుటుంబం సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ తర్వాత స్నేహితులుగా మారి.. ఇప్పుడు ప్రేమికులు అయ్యారని తెలుస్తుంది. పైగా ఈ ఇద్దరి ముద్దు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వార్తలొస్తున్నాయి.

Related posts