telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాట్ హీరోయిన్ సెల్ఫ్ క్వారంటైన్

Disha

గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19)  ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, సినిమా, టెలివిజన్ షూటింగులు, పార్కులు, పబ్బులు, బార్లు, రవాణా సదుపాయాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. సెలబ్రిటీలంతా హోమ్ క్వారంటైన్‌కే పరిమితమైపోయారు. తాజగా హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ దిశ పటాని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక మంది సినీ నటులు స్వియ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. విదేశాలకు షూటింగ్స్‌కు వెళ్లి వచ్చిన వారు సైతం.. సామాజిక బాధ్యతతో ఇంటిలోనే ఉంటున్నారు. తాజాగా దిశ పటాని కూడా స్వీయ గృహ నిర్భంధంలో ఉంది. తనకు కాస్త ఫ్రీ టైమ్ దొరకడంతో… ఇంట్లో తన పెంపుడు పిల్లితో టైం స్పెండ్ చేస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది పటాని.

Related posts