శ్రీ విష్ణు ‘గాలి సంపత్’ చిత్రం కూడా ఇటీవలే ప్రారంభమైంది. ‘పటాస్’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్‌గా వర్క్ చేసిన మిత్రుడు ఎస్. కృష్ణ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తూ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ జంటగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే అనిష్ దర్శకత్వంలో శ్రీవిష్ణు చేస్తున్న గాలి సంపత్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు అనిల్ రావిపుడి సమర్పణలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శక పర్యవేక్షకుడిగా చేస్తున్నాడు. అంతేకాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు మంచి స్పందన అందుకున్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి గాలి సంపత్ వాటిని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
previous post
అనసూయ, హైపర్ ఆది కెమిస్ట్రీ… రైజింగ్ రాజు కామెంట్స్