telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

షాకింగ్‌ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటిన బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,510 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 49,060 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ.51,180 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ.46, 910 పలుకుతోంది. ఇక వెండి విషయానికి.. ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం వెండి ధర రూ.72, 000గా ఉంది.

Related posts