telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీకు అవకాశాలు లేకుండా చేస్తాను… సల్మాన్ వార్నింగ్ ఎవరికంటే ?

Salman

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న ‘చిన్నారి పెళ్లికూతురు’ హీరో సిద్ధార్థ్ శుక్లాకు సల్మాన్ వార్నింగ్ ఇవ్వడం బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్‌కు కోపం ఎక్కువ. దాంతో హౌజ్‌లో ఉన్నవారిపై అరవడం, వారిపై చేయి చేసుకోవడం, అసహ్యంగా మాట్లాడటం వంటివి చేస్తున్నాడు. దాంతో సల్మాన్ సిద్ధార్థ్‌ ప్రవర్తపై మండిపడ్డారు. “అసలు ఏం అనుకుంటున్నావ్ నువ్వు? ఆ ప్రవర్తనేంటి? ఇంకోసారి హౌజ్‌లో ఇదే విధంగా ప్రవర్తించావంటే ఊరుకోను. నిన్ను ఈ హౌజ్‌ నుంచి గెంటేస్తాను. నువ్వు బయటికి వెళ్లినా కూడా ఇండస్ట్రీలో నీకు పని లేకుండా చేస్తాను. ఈ షో నుంచి నేను ఎవర్నైనా ఎలిమినేట్ చేయాలనుకుంటే అది కచ్చితంగా నువ్వు అవుతావ్. హౌజ్‌లో నీ ప్రవర్తన వల్ల బాధపడ్డ వారందరికీ నేను న్యాయం చేస్తాను’ అని వెల్లడించారు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఇప్పుడు ప్రసారం అవుతున్న బిగ్ బాస్‌ షో అంత ఆసక్తికరంగా లేదు. ఎప్పుడైతే సిద్ధార్థ్ శుక్లా ఇతర కంటెస్టెంట్లతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి టీఆర్‌పీ రేటింగ్స్ దూసుకెళుతున్నాయి. అందుకే సిద్ధార్థ్ దురుసుగా ప్రవర్తిస్తున్నా కూడా అతన్ని కాకుండా ఇతర కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నారు.

Related posts