telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనాక్షి డబ్బు పశువు… మండిపడ్డ మంత్రి

Sonakshi-Sinha

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి శుక్రవారం నాడు తల్లి పూనమ్ సిన్హాతోపాటు గెస్ట్ గా వచ్చారు సోనాక్షి. సోనాక్షి కో పార్టిసిపెంట్‌గా రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త రూమా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి గేమ్ ఆడారు. తొలి రౌండ్ లోనే ప్రశ్నలన్నింటికీ లైఫ్ లైన్లు వాడిన వీరిద్దరికీ రామాయణానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. “రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?” అని అమితాబ్ ప్రశ్నించి.. దానికి ఆప్షన్స్ గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. రామాయణం మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా సమాధానం ‘లక్ష్మణుడు’ అని కరెక్ట్ గా చెప్పేవారు. కానీ సోనాక్షికి రామాయణం గురించి తెలియక దీనికి కూడా లైఫ్ లైన్ తీసుకున్నారు. లైఫ్ లైన్ తీసుకునే ముందు ‘సీత’ అయి ఉంటుందని గెస్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెని ఏకిపారేస్తున్నారు. “sonakshi so dumb” పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ప్రారంభించి ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సునీల్ భరాలా అనే మంత్రి స్పందించారు. సోనాక్షి ఓ డబ్బు పశువు అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్లు డబ్బు కోసమే ఆలోచిస్తారు కానీ మంచి విషయాలు నేర్చుకోవడానికి అసలు శ్రద్ధ చూపరు. ఈ కాలంలో ఇలాంటి నటీనటులు కేవలం డబ్బు కోసమే బతుకుతున్నారని.. డబ్బు ఎలా సంపాదించాలి..? ఎలా ఖర్చు పెట్టాలనే తప్ప… చరిత్ర గురించి కానీ దేవుళ్ల గురించి కానీ అసలు నేర్చుకోవడం లేదని.. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని మండిపడ్డారు. మరి ఈ వ్యాఖ్యలపై సోనాక్షి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts