telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికా : .. జాతీయ భద్రతా సలహాదారుని .. ఇంటికి పంపేసిన ట్రంప్ ..

john boldan out from his job by trump

ట్రంప్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పించారు. వైట్‌హౌస్‌లో ఆయన సేవలు ఇక అవసరం లేదని గత రాత్రే ఆయనతో చెప్పినట్టు ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయన సలహాల్లో చాలా వాటిని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిపారు. బోల్డన్‌ను రాజీనామా చేయమని చెప్పానని, ఉదయమే ఆయన తన రాజీనామా లేఖను తనకు ఇచ్చారని పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరిని నియమించేదీ వచ్చే వారం వెల్లడించనున్నట్టు ట్రంప్ తెలిపారు.

Related posts