telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టర్కీ-సిరియా మధ్య … యుధ్ద మేఘాలు … ట్రంప్ ఆందోళన..

trump fire on syria and turkey situation

సిరియాలో క్రమేపీ టర్కీ సైనిక దళాలు ప్రవేశిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న అంతర్యుధ్ధం ముదిరి పాకాన పడేట్టు కనిపిస్తోంది. తమ దేశ(సిరియా) సరిహద్దుల్లోని దాదాపు 36 లక్షల మంది శరణార్థులను తిప్పి పంపివేయడానికి సిరియా చేస్తున్న యత్నాలను టర్కీ ఖండిస్తోంది. సరిహద్దుల్లో ఓ సేఫ్ జోన్ ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు సిరియా అడ్డుకుంటోందని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆరోపిస్తున్నారు.

ఈ బోర్డర్లో కొన్ని వారాలుగా సాగుతున్న తమ దేశ సైనిక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా తమ భద్రతా దళాలు సిరియాలో ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ‘ ఆక్రమణ ఏ సమయంలోనైనా జరగొచ్చు ‘ అని వార్నింగ్ ఇచ్చారు.

Related posts