telugu navyamedia
సినిమా వార్తలు

64 సంవత్సరాల “రాజమకుటం”.

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం వాహిని ప్రొడక్షన్స్ వారి “రాజమకుటం” 24-02-1960 విడుదలయ్యింది.

నిర్మాత, దర్శకుడు బి.యన్.రెడ్డి గారు వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు: డి.వి.నరసరాజు స్క్రీన్ ప్లే: బి.ఎన్.రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, బి.ఎస్.రామయ్య, సంగీతం: మాష్టర్ వేణు, పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, నాగరాజు, ఫోటోగ్రఫీ: బి.ఎన్.కొండారెడ్డి, కళ: ఏ.కె.శేఖర్,వాలి, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, వి.జె.శర్మ, ఎడిటింగ్: వాసుమణి,రాజామణి. అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, రాజసులోచన, గుమ్మడి, కన్నాంబ, రాజనాల, పద్మనాభం, వంగర, కస్తూరి శివరావు, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు
“సడిసేయకో గాలి సడిసేయబోకే”
“ఊరేది పేరేది ఓ చందమామ”
“ఏడనున్నాడో యెక్కడున్నాడో నా చుక్కలరేడు”
“ఏటి ఒడ్డున మావూరు ఎవ్వరులేరు మావారు”
వంటి పాటలు ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో నిర్మించారు. తెలుగు సినిమా “రాజమకుటం” 24-02-1960 న విడుదల కాగా ఒక రోజు తరువాత తమిళ చిత్రం “రాజమగుడం” 25-02-1960 న విడుదల అయ్యింది. ఏలూరు – వెంకట్రామ థియేటర్ ప్రారంభ చిత్రంగా “రాజమకుటం” చిత్రాన్ని విడుదల చేశారు. ఎంతో వ్యయ ప్రయసాలతో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధింది, పలు కేంద్రాలలో 50 రోజులు ఆడింది. విజయవాడ – విజయా టాకీస్ లో 11 వారాలు ప్రదర్శింపబడింది.

తమిళం లో కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని గుంటూరు శ్రీ లలిత ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్స్, అధినేత, ఎన్టీఆర్ గారి అభిమాని, కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు 1996లో మళ్ళీ విడుదల చేయగా మంచి కలెక్షన్స్ సాధించింది.

Related posts