telugu navyamedia
సినిమా వార్తలు

రాధేశ్యామ్ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్స్‌గా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘రాధేశ్యామ్‌’ కథ‌

విక్రమాదిత్య(ప్రభాస్‌) హస్తసాముద్రిక నిపుణుడు. హస్తసాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. అతనెంత గొప్పోడు అంటే ఇందిరాగాంధీ ని కలిసి ..ముందే ఎమర్జన్సీ గురించి చెప్తాడు. ఆ తర్వాత దేశం వదిలి విదేశాల్లో సంచారం చేస్తూంటాడు.

అతని గురువు పరమహంస. ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు ఎంతో మంది చేతి రేఖలను పరిశీలించి ఉంటాడు. కానీ శిష్యుడు చేయి.. గురువు చూడకూడదన్న కారణంగా చూడడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా వదిలి రోమ్‌లో సెటిల్‌ అవుతాడు విక్రమాదిత్య. ఆ క్రమంలో అక్కడ అతనికి ప్రేరణ (పూజా హెగ్డే) పరిచయమవుతుంది. ప్రేరణ చక్రబర్తి తన పెదనాన్న హాస్పిటల్లో పనిచేస్తుంటుంది .

Radhe Shyam Trailer Out: Here is everything you need to know

డాక్టర్‌ ప్రేరణ(పూజా హెగ్డే)తో మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తన చేతిలో ప్రేమ రేఖ లేదనుకునే ఆదిత్య.. ప్రేరణతో ప్రేమలో పడతాడు. మరోవైపు ప్రేరణ క్యాన్సర్‌తో బాధపడుతుంది. కానీ ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పదు.

ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యులు చెప్తారు. కానీ నాటకీయంగా ఓ రోజు విక్రమాదిత్యకు తెలుస్తుంది. ఆమె చెయ్యి చూసి నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావని చెప్తాడు .మరో ప్రక్క విక్రమాదిత్య కు కూడా ప్రాణ గండం ఉంటుంది. అలాగే అతని జీవితంలో జాతకం ప్రకారం ప్రేమ,పెళ్లి ఉండవు. అది ఎలా సాధ్యం అవుతుంది? విధిని ఎదురించి తన ప్రేమని విక్రమాదిత్య గెలిపించుకోగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

Thumbnail image

డాక్టర్‌ కేరక్టర్‌లో, నేచర్‌ని ఇష్టపడే అమ్మాయిగా పూజా హెగ్డే లుక్స్ ఫిదా చేస్తాయి. భాగ్యశ్రీ నృత్యం చేసే తీరు, జగపతిబాబు యాటిట్యూడ్‌, కృష్ణంరాజు పెద్దరికం.. ఏ ఫ్రేమ్‌కి ఆ ఫ్రేమ్‌ బావుంది. ముఖ్యంగా సినిమాను తీసిన లొకేషన్లు, కెమెరా యాంగిల్స్, సెలక్ట్ చేసుకున్న థీమ్‌, గ్రాఫిక్స్ హైలైట్ అయ్యాయి.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

 మన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి.

ఇటలీలోని బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో కథ.. అలా సాగిపోతుంది. ప్రభాస్‌ గత సినిమాల మాదిరి ఫైట్‌ సీన్స్‌, మాస్‌ సాంగ్స్‌ గానీ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథంతా హీరో, హీరోయిన్ల చుట్టే తిరుగుతుంది. ప్రేమ కథకు హీరో, హీరోయిన్ల​ మధ్య కెమిస్ట్రీ చాలా అవసరం. ఈ సినిమాలో ఆ కెమెస్ట్రీ వర్కౌట్‌ అయినా.. అందుకు తగినట్లుగా బలమైన సీన్స్‌ లేకపోవడం మైనస్‌.

ఫస్టాఫ్ లో రొమాంటిక్ ఫన్ లవ్ స్టోరీగా క‌థ‌ను నడిపే ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్ధంలో కాసేపు దాన్ని థ్రిల్ల‌ర్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈ క్ర‌మంలో దర్శకుడు వేసిన ప్ర‌తి స్టెప్ సాగ‌తీత వ్య‌వ‌హారంలాగే న‌డిచింది త‌ప్ప‌.. ఎక్క‌డా కథనంలో ఊపు తీసుకురాలేక‌పోయింది. ఇంటర్వెల్ కు క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ట్లు అనిపించినా.. ఆ త‌ర్వాత వ‌చ్చే ఎపిసోడ్‌తో అదంతా నీరుగారిపోతుంది. లవ్ సీక్వెన్స్ విజువల్స్ మాత్రం ప్రేక్ష‌కుల‌కు మంచి కాల‌క్షేపాన్నిస్తాయి.

Prabhas Unveils New Release Date of Radhe Shyam, Film to Hit Theatres on  Pongal 2022

సెకండాఫ్‌లో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓడ సీన్‌.. పలు ఇంటర్యూల్లో చిత్ర యూనిట్‌ చెప్పినట్లుగా మెస్మరైస్‌ చేయకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మొత్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఇమేజ్‌ ఉన్న ప్రభాస్‌.. ఇలాంటి కథను ఒప్పుకొని, చేయడం నిజంగా ఈ విషయంలో ప్రభాస్‌ను అభినందించాలి.

ముఖ్యంగా హీరోయిన్‌తో క‌లిసి ట్రైన్‌లో చేసే విన్యాసం, ఆ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన తీరు చాలా బాగుంది. జ‌గ‌ప‌తిబాబు చేయి చూసి జాత‌కం చెప్ప‌డం, ఆస్ప‌త్రిలో శ‌వాల హ‌స్త ముద్ర‌ల్ని చూసి వాళ్ల గురించి చెప్ప‌డంలాంటి స‌న్నివేశాలు మెప్పిస్తాయి. 

Radhe Shyam: First Review Of Prabhas, Pooja Hegde's Love Saga Is Out  Stating It's A Sure Shot Winner!

పేరుమోసిన జోతిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్‌ ఒదిగిపోయాడు. మాస్‌ ఇమేజ్‌ని ఉన్న ప్రభాస్‌.. ఈ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించాడు. ఇక డాక్టర్‌ ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. వీరిద్దరి జోడి తెరపై అందంగా కనిపించింది..

అలాగే… విక్రమాదిత్య గురువు పరమహంస పాత్రలో కృష్ణంరాజు ఆకట్టుకున్నాడు . పరమహంసగా నటించిన కృష్ణంరాజుకు మధ్య సన్నివేశాలు కూడా పేలవంగా ఉన్నాయి. ఓవరాల్ గా రాధే శ్యామ్ విజువల్ పరంగా అద్భుతంగా ఉంది.. కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది.

Related posts