telugu navyamedia
సినిమా వార్తలు

హృతిక్ రోష‌న్ తాత‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ నిర్మాత జె ఓమ్ ప్ర‌కాశ్ కన్నుమూత

J-Om-Prakash

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ తాత‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ నిర్మాత జె ఓమ్ ప్ర‌కాశ్ ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. ముంబైలో ఆయన కన్నుమూసిన విష‌యాన్ని ప్ర‌ముఖ న‌టుడు దీప‌క్ ప‌రాష‌ర్ ధృవీకరించారు. “నా ప్రియ‌మైన మామ మిస్ట‌ర్ జె ఓం ప్ర‌కాశ్ గంట క్రితం క‌న్నుమూశారు. స్వ‌ర్గంలో ఉన్న అత‌ని స్నేహితుడు మిస్ట‌ర్ మోహ‌న్ కుమార్ వ‌ద్ద‌కి వెళ్ళారు. భార‌తీయ సినిమాకి ఆయ‌న చేసిన కృషి వెల‌క‌ట్ట‌లేనిది. కొన్ని నెల‌ల క్రితం అత‌నిని చూడ‌టానికి వెళ్లిన‌ప్పుడు తీసుకున్న చిత్రం ఇది” అని దీప‌క్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఓం ప్రకాశ్‌కి ప‌లువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ద‌ర్శకుడిగా తెర‌కెక్కించిన తొలి చిత్రం ఆప్‌కీ క‌సంలో రాజేష్ ఖ‌న్నాని డైరెక్ట్ చేశాడు. జితేంద్ర‌తో కూడా ఆయ‌న పని చేశారు. జె ఓమ్ ప్ర‌కాశ్ తెర‌కెక్కించిన చాలా చిత్రాల టైటిల్స్ ఏ అనే లెట‌ర్‌తో ప్రారంభం కావ‌డం విశేషం. ఆప్‌కీ క‌స‌మ్ (1974), ఆహిర్ క్యోన్ (1985), అర్ప‌న్ (1983), అప్నా బ‌నాలో (1982). ఆషా (1980), అప్నాప‌న్‌ (1977) అనే చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. నిర్మాత‌గా ఆయ సావ‌న్ జూమ్ కె (1969), ఆయే మిలాన్ కీ బేలా (1964), ఆయే దిన్ బ‌హర్ కే (1966), ఆంకో ఆకో మే (1972) హిట్ చిత్రాలు తీసారు. 1995-1996 వరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఆయ‌న‌ పని చేశారు.

Related posts