telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో కరోనా విజృంభణ.. మరో హీరోయిన్‌ పాజిటివ్‌

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది.  తాజాగా కరోనా మరోసారి బాలీవుడ్ నటీనటులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే కరోనా టెస్ట్ లో పాజిటివ్ రిజల్డ్ వచ్చిన రణబీర్ కపూర్ హోమ్ క్వారంటైన్ లో గడుపుతుంటే… లేటెస్ట్ గా యంగ్ హీరోయిన్ తారా సుతారియాకు, నటుడు సిద్ధాంత్ చతుర్వేదికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. తారా ‘తపడ్’ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉండగా, సిద్ధాంత్ ‘ఫోన్ బూత్’ షూటింగ్ లో ఇషాన్ కట్టర్, కత్రినాకైఫ్ తో కలిసి నటించాల్సి ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఆ కార్యక్రమాలను రద్దు చేసుకుని హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం. తారా సుతారియా కరోనా బారిన పడిన విషయాన్ని స్వయంగా తెలియచేయకపోయినా… ఆమె సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

Related posts