telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాఠ్యాంశంగా .. ఆర్టికల్ 370 రద్దు .. : జేనీ నడ్డా

article 370 as lesson in school level

ఎన్నికల సందర్భంగా ప్రచారంలో బిజీగా ఉంది బీజేపీ. తాజా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చకున్నారు కమలనాథులు. మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేనీ నడ్డా మరో కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని తెలిపారు. భవిష్యత్ తరాలు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ఎన్నికల అజెండాగా తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొద్దిరోజుల కిందటే సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన ముంబైలో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు.

ఆర్టికల్ 370 రద్దు అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా.. జేపీ నడ్డా తాజాగా ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. పుణేలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాఠ్యాంశాలుగా చేర్చుతామని అన్నారు. స్టేట్ సిలబస్ లోనూ ఈ అంశాన్ని పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా ఆవిర్భవించడానికి గల పూర్తి కారణాలను పాఠ్యాంశాల్లో వివరిస్తామని అన్నారు. భవిష్యత్ తరాలు దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని ఓ అజెండాగా తీసుకుందని అన్నారు.

Related posts