ఏపీలో రాజకీయాలలో రోజుకొక మార్పు తప్పడంలేదు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి మారుతారో అర్ధం కానీ పరిస్థితి. ఇప్పటికే ప్రధాన పార్టీలనుండి అనేక మంది అటుఇటు మారుతూనే ఉన్నారు. తాజాగా, తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం నాడు చంద్రబాబుకు పంపిన ఆయన, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పౌర సరఫరాల కార్పొరేషన్ కు కూడా రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు.
టీడీపీ నుంచి కర్నూలు జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఆశించిన ఆయన, తన కోరిక తీరే అవకాశాలు లేవన్న నిర్ణయానికి వచ్చి పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది. ఇక చల్లా, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, ఇప్పటికే ఈ విషయాన్ని తమ ముఖ్య అనుచరులకు ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ ను కలిసే చల్లా, ఆపై పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్