telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు… రెజీనా సంచలన వ్యాఖ్యలు

Regina

సౌత్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది.తాజాగా రెజీనా చాలా సార్లు లైగింక వేదింపులకు గురయ్యాను అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు పలువురు ప్రయత్నించారట. వేధింపులు ఎదురయ్యాయి. అలాగే తనని వేధించాలని చూసిన ఒక యువకుడిని పబ్లిక్ ముందే చితక్కొట్టానని కూడా తెలిపింది. “మిస్టర్ చంద్రమౌళి” సినిమా ప్రమోషన్ సందర్భంగా రెజీన ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది.

Related posts