telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇంటికో ఉద్యోగం… ఉచితంగా వాషింగ్‌ మిషన్లు : అన్నాడీఎంకే వరాలు

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ ఆదివారం రాత్రి ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం మేనిఫెస్టోను రిలీజ్‌ చేశారు. ఇందులో ఎప్పటిలానే అనేక హామీలు ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉచితంగా వాషింగ్‌ మెషిన్లు, సోలార్‌ స్టవ్‌లు, అందరికీ కేబుల్‌ టీవీ సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ప్రతి ఇంటిలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అమ్మ హౌసింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది. మహిళలకు సిటీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామని, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పర్యావరణ సహిత ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రూ. 25వేలు సబ్సిడీ, కాలేజీ విద్యార్థులకు ఉచిత 2 జిబీ డేటా అందిస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అలాగే శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు వంటివి ఇందులో ఉన్నాయి.

Related posts