telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : షూటింగ్ కోసం ఇండియా చేరిన హాలీవుడ్ భామ

Alison

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన దాంతో ఒక్కొక్కరుగా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. తాజాగా హాలీవుడ్ భామ అలిసన్ డూడీ కూడా ఇండియాలో అడుగుపెట్టిందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ ఓ ప్రత్యేక పాత్రకోసం అలిసన్ డూడీని తీసుకున్నాడు జక్కన్న. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొనేందుకు అలిసన్ డూడీ ఇండియా చేరుకుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ భామ. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కాగా టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. తాజాగా’రామరాజు ఫర్ భీమ్’ వీడియోను రిలీజ్ చేసాడు జక్కన్న. ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన భీమ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది.

Related posts