telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రెండు లక్షల కోట్లు దాటనున్న.. ఏపీ బడ్జెట్..

ap representative on gst council today

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 12న ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్లో నవర్నతాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని బుగ్గన తెలిపారు. ఆయన.. సుమారు రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెడతామన్నారు. ప్రభుత్వ ధన దుర్వినియోగాన్ని అరికడతామని, హామీలను పూర్తిగా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి తెలిపారు. 25 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల వేళ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వంలో ఏ రంగానికి, ఏ శాఖకు ఎంతమేర కేటాయింపులు ఉండనున్నాయనే అంశమై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను గత ప్రభుత్వం రూపొందించింది. 2014-15లో ఆంధ్రాపై అప్పుల భారం రూ.1,48,744 కోట్లు ఉండగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అది రూ.2,23,706 కోట్లకు చేరింది.

Related posts