telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ లో గాయత్రి గుప్తాకు నో ఎంట్రీ… కారణం ఆ జబ్బే

Gayatri-Gupta

బిగ్ బాస్ తెలుగు సీజన్ -3 ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది. నటి గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడని, వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని అన్నారని గాయత్రి గుప్తా తెలిపింది. తాను సరేననడంతో వేరే ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని పేర్కొంది. అభిషేక్, రఘు, రవికాంత్‌లు తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారని వివరించింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది. ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షోకు ఎంపిక చేశారన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న ఆరు సినిమాలను వదిలేసుకున్నానని వాపోయింది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి తెలిపింది.

సినీ వర్గాల్లో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఇష్యూపై మరోసారి క్లారిటీ ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఛాన్స్ ఎలా వచ్చింది..? ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాలను వెల్లడించింది. మొదట తనను బిగ్ బాస్ వాళ్లు సంప్రదించినప్పుడు ఆ షోకి ఉన్న పాపులారిటీ చూసి ఒప్పుకున్నానని.. జీవితంలో ప్రైవసీ ఉండదనేది వాస్తవంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు చెప్పింది. ఆ కారణంగా బిగ్ బాస్ కి కనెక్ట్ అయినట్లు.. వాళ్లు ఆఫర్ చేసిన పేమెంట్ కూడా నచ్చడంతో బిగ్ బాస్ కి ఓకే చెప్పేశానని తెలిపింది. మీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా..? అని నిర్వాహకులు అడిగినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని చెప్పినట్లు వెల్లడించింది. ఆ వ్యాధి కారణంగా బరువులు ఎత్తలేనని, పది రోజులకొకసారి ఫిజియోథెరపీ అవసరం పడొచ్చని చెప్పినట్లు తెలిపింది. మీ వల్ల రేటింగ్స్ వస్తాయని.. ఫిజియోథెరపీ మేం చేయిస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పినట్లు వెల్లడించింది. అగ్రిమెంట్ ప్రకారం జూలై 15 నుండి 100 రోజులు వేరే ప్రాజెక్ట్స్ చేయకూడదన్నారని..దాని వలన ఐదారు సినిమాలు వదిలేశానని చెప్పింది. ఫైనల్ గా బిగ్ బాస్ కి మీరు సెలెక్ట్ కాలేదని ఫోన్ చేసి చెప్పారని.. కారణం ఏంటని ప్రశ్నిస్తే.. మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని దాని వలన మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని షాక్ ఇచ్చారని వెల్లడించింది.

Related posts