telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఓ చిన్నారి డ్రీం పూర్తి చేసిన రాహుల్…

రాహుల్ గాంధీ ఓ చిన్నారి డ్రీం పూర్తి చేసి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఈ మధ్యే రాహుల్ వద్దకు ఓ చిన్నారి వచ్చాడు.  పెద్దయ్యాక ఏమౌతావని చిన్నారిని అడిగితె, తాను పైలట్ అవుతారని, తనకు ఎత్తులో ప్రయాణం చేయడం అంటే ఇష్టం అని, అందుకే పైలట్ కావాలని పేర్కొన్నాడు.  రాహుల్ గాంధీ రెండుమూడు సార్లు అడిగినా తొమ్మిదేళ్ల చిన్నారి అద్వైత్ అదే సమాధానం చెప్పడంతో, ఆ చిన్నారి కలను నెరవేర్చేందుకు రాహుల్ సిద్ధం అయ్యాడు.  మరుసటిరోజే రాహుల్ గాంధీ ఆ చిన్నారిని విమానంలోని కాక్ పిట్ లోపలికి తీసుకెళ్లి కెప్టెన్ కు పరిచయం చేశాడు.  విమానం ఎలా ఎగురుతుంది.  మెకానిజం ఏంటి అనే విషయాలను కెప్టెన్, రాహుల్ గాంధీలు చిన్నారికి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ప్రజలను రాహుల్ ను మెచ్చుకుంటున్నారు.

Related posts