ఏపీలో ప్రభుత్వం వైఎస్‌ఆర్ రైతు భరోసాకు సంబంధించి జిల్లాలో 6.30 లక్షల మంది రైతులు ఉండగా, రైతుభరోసాకు అర్హులుగా 3.23 లక్షల మందిని గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 3,09,057 మంది బ్యాంకు ఖాతాలకు సొమ్ములు చెల్లించారు. జిల్లా మొత్తంమీద రూ.243.20 కోట్లు చెల్లింపులు జరిగినట్టు జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇందులో కౌలు రైతులకు సంబంధించి 13,855 మందికి చెల్లింపులు జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9,482 మంది కౌలు రైతులకు రూ.10.12 కోట్లు చెల్లింపులు జరిగినట్టు జిల్లా వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి.
అలాగే నేటినుండి పీఎం కిసాన్ కింద రావాల్సిన 2 వేల రూపాయల భరోసా సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు అందించనున్నట్టు జిల్లా వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. రైతుభరోసాకు సంబంధించి అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుందని వ్యవసాయా ధికారులు చెబుతున్నారు.
డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు: మంత్రి అవంతి