telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కలిసి పోరాడుదాం.. రేవంత్ రెడ్డిని కోరిన పవన్!

pawan revanth

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఈ అంశం పై పోరాటానికి కలిసి రావాలని, పవన్ రేవంత్ రెడ్డిని కోరారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతు రావు నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో పాల్గొనాలని రేవంత్ ను పవన్ ఆహ్వానించారు. పవన్‌ ఆహ్వానానికి రేవంత్‌ స్పందిస్తూ, తప్పకుండా వస్తానని చెప్పారు. వారం రోజుల క్రిందట, వీహెచ్, పవన్ కళ్యాణ్ కలిసి, ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. వీహెచ్ పిలుపుకు స్పందించిన పవన్ కళ్యాణ్, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన కలిసి వస్తుందని తెలిపారు.

Related posts