telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కర్ణాటకీయం : .. రాజీనామాల వెనుక కాంగ్రెస్ హస్తం… సౌమ్యారెడ్డి …

congress itself reason for karnakata issue

కర్ణాటకీయం పై తమదైన శైలిలో గొంతువిప్పుతున్న నేతలు. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి కూడా తమ పార్టీకే వ్యతిరేకంగా స్పందించడం విశేషం. పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి కూతురైన ఈమె బెంగుళూరులో..విధానసౌధలో జరిగిన సీఎల్ఫీ సమావేశానికి హాజరైంది. ఈ మధ్యే ఢిల్లీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయిన సౌమ్యా రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. కానీ ఇక్కడ.. ఈ రాష్ట్రంలో పార్టీ సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడంలేదని, జూనియర్లకు, అనుభవం లేనివారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె పేర్కొంది.

13 నెలలు గడిచాక.. తన తండ్రి రామలింగారెడ్డి గత డిసెంబరులో పార్టీ వ్యవహారాల గురించి నోరెత్తవలసివచ్చిందని ఆమె వ్యాఖ్యానించింది. ఈ రాష్ట్రంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం పడిపోతుందా లేక గండం నుంచి బయటపడి గట్టెక్కుతుందా అన్న విషయాన్ని తాను చెప్పలేనని, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే తాను కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని సౌమ్యారెడ్డి తెలిపింది. ‘ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాకు ద్రోహం చేసిందని భావిస్తున్నాం.. పార్టీలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. దీంతో మా తండ్రి ఎంతో మనస్తాపం చెందుతున్నారు ‘ అని ఆమె వెల్లడించింది. తన తండ్రి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓ మనుగడనిచ్చారని, కానీ ఈ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించడం లేదని సౌమ్యారెడ్డి వాపోయారు.

Related posts