telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరోసారి చైనాకు షాక్ ఇచ్చిన నేపాల్…

మరోసారి చైనాకు షాక్ ఇస్తుంది నేపాల్. అయితే ఇండియా నేపాల్ దేశాల మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.  రెండు దేశాల మధ్య రాకపోకలకు పెద్దగా అభ్యంతరాలు ఉండబోవు.  ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి.  అయితే, కరోనా తరువాత నేపాల్ కు చైనా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.  నేపాల్ కు తాయిలాలు ఇస్తూ దగ్గర కావాలని చూసింది.  ఈ సమయంలోనే ప్రధాని ఓలి ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడారు.  అదే సమయంలో మ్యాప్ విషయంలో కూడా నేపాల్ కొంత కఠినంగా వ్యవహరించింది.  అయితే, కరోనా వ్యాక్సిన్ విషయంలో నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది.  చైనాలో ప్రస్తుతం నాలుగు రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయి.  ఇండియాలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  అయితే, నేపాల్ వ్యాక్సిన్ విషయంలో చైనాను పక్కన పెట్టి ఇండియా వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపింది.  చైనా ఇచ్చిన అఫర్ ను పక్కన పెట్టింది.  ఇది చైనాకు మింగుడుపడని విషయంగా మారిందని చెప్పాలి.  నేపాల్ ను తన దారిలోకి తెచ్చుకొని ఇండియాపై ఒత్తిడిపెంచాలని చూసిన చైనాకు ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించిందని చెప్పొచ్చు. చుడాలిమరి ఈ విషయం పై చైనా ఏ విధంగా స్పందిస్తుంది అనేది.

Related posts