telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నిర్భయ నిందితులకు .. ఒకేసారి ఉరి..అన్ని సిద్ధం..

Refusal to nirbhaya apologize

అధికారులు నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్ష వేయనున్నారు. తిహార్‌ జైల్లో అధికారులు నాలుగు ఉరికంబాలు సిద్ధం చేశారు. ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణం కూడా పూర్తి చేశారు. నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు వినయ్‌, పవన్‌, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌లను ఒకేసారి ఉరితీస్తారు. ఈ నలుగురి డెత్‌ వారెంట్‌పై ఈ నెల 7న పాటియాల కోర్టు తీర్పు వెల్లడించిన విషయం విదితమే.

దాదాపు 8 సంవత్సరాల క్రితం బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఈ మూర్ఖులంతా దారుణాతి దారుణంగా రేప్‌ చేసి, పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన సదరు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా.. తనకు బతకాలని ఉందనీ.. నాపై ఆఘాయిత్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె వాగ్మూలం ఇచ్చింది. దాదాపు 15 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమె మరణానంతరం పార్లమెంట్‌లో నిర్భయ చట్టాన్ని అమలుపరిచారు. ఈ ఘటన తర్వాత ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడం, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోలీసులు, కోర్టులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

Related posts