telugu navyamedia
క్రీడలు వార్తలు

విలియమ్సన్ రికార్డు సమ చేసిన విరాట్…

kohli appriciated newzeland captain

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ 20 లో భారత జట్టు ఓడిపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అందర్నీ ఆకట్టుకుంది. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కోహి కేవలం 46 బంతుల్లో 77 పరుగులు చేసి ఆదుకున్నాడు. అయితే ఈ హాఫ్ సెంచరీతో న్యూజీలాండ్ సారథి కేన్ విలియమ్‌సన్‌ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20లో కెప్టెన్‌గా కోహ్లీ 11వ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ, విలియమ్‌సన్‌ కెప్టెన్ లుగా 11 అర్ధ సెంచరీలతో సమంగా ఉన్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ తొమ్మిది అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఏడు అర్ధ సెంచరీలతో ఫాఫ్ డుప్లెసిస్ ఈ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్నాడు. డుప్లెసిస్ టీ20ల్లో సెంచరీ కూడా కొట్టాడు. డుప్లెసిస్ తర్వాత కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ మాత్రమే టీ20ల్లో సెంచరీ చేశాడు. అయితే టీ20ల్లో విరాట్‌ కోహ్లీ 27 సార్లు అర్ధ సెంచరీలు బాదాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50లు అతడివే. ఆ తర్వాత రోహిత్ శర్మ (25), డేవిడ్ వార్నర్ (19), మార్టిన్ గుప్టిల్ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Related posts