telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ హిట్ డైరెక్టర్ తో మళ్ళీ బాలయ్య…

మాస్ హీరోగా బాలకృష్ణ అభిమానులను ఎంతగానో మెప్పించిన సంగతి తెలిసిందే.  బాలకృష్ణ చేసిన చాలా సినిమాలు మాస్ హీరోగా నిలబెట్టాయి.  అయితే, ఈ టాప్ హీరో గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.  కాగా, ఇప్పుడు ఈ టాప్ హీరో మాస్ డైరెక్టర్ బి గోపాల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.   గతంలో బి గోపాల్ దర్శకత్వంలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు.  వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.  ఇన్నాళ్ల తరువాత బాలకృష్ణతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు బాలయ్య. తాజాగా దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ ను అందిస్తున్నారు. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటితో కలిసి సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నది.  ఈ సినిమా తరువాత బాలయ్య… క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తాడు. ఆ తర్వాత వీరి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Related posts