telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తాతా మనవడు ఒకేసారి డిప్లొమా అందుకున్నారు…!?

WWII Vet gets high school Diploma with Grandson

తొంభై ఏళ్లు వచ్చేసరికి ఎవరైనా ఏం చేస్తారు… ఓ మూలాన కూర్చొని రామా కృష్ణ అంటూ కాలం వెళ్లదిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన 91 ఏళ్ల ఓ తాత ఏకంగా డిప్లమా అందుకున్నాడు. అది కూడా తన మనవడితో కలిసి హై స్కూల్ డిప్లమా సర్టిఫికేట్ అందుకోవడం విశేషం. డెర్రీలో నివాసముండే 91 ఏళ్ల పెటె సబెంద్ర తన మనవడు కెస్‌తో కలిసి డిప్లమా అందుకున్నాడు. 1940లో సబెంద్ర డెర్రీ టౌన్‌షిప్ హై స్కూల్ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో అతని తండ్రి చనిపోయాడు. తండ్రి కాలంచేయడంతో కుటుంబ పోషణ పెద్ద కొడుకైన సబెంద్రపై పడింది. దాంతో చేసేదేమీలేక ఎనిమిదో క్లాస్‌లోనే చదువు మానేసి పనికి వెళ్లడం ప్రారంభించాడు. అప్పుడు మానేసిన చదువు సరిగ్గా ఎనిమిది దశాబ్దాల తరువాత మళ్లీ చదివి ఇప్పుడు డిప్లమా పాసయ్యాడు. బుధవారం మిడ్డల్ డెర్రీ స్కూల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సబెంద్ర డిప్లమా పట్టా అందుకున్నాడు. ఈ సందర్భంగా సబెంద్ర మాట్లాడుతూ మనవడితో కలిసి డిప్లమా అందుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉందని అతడు మురిసిపోయాడు.

Related posts