telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికలు ప్రారంభం

Voters Registration from tomorrow |

తెలంగాణలో జిల్లా, మండల పరిషత్ తొలి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలైన 640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మొత్తం మూడు విడుతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తొలి విడుతగా 197 మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

తొలి విడుతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, రెండు జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 2,097 ఎంపీటీసీలు, 195 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎంపీటీసీ స్థానాలకు 7072 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది పోటీపడుతున్నారు.మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా గగ్గల్లపల్లి ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేశారు. పోటీ నుంచి తనను తప్పుకోవాలంటూ టీఆర్ఎస్ అభ్యర్ధి బెదిరించాడని, దానితో పాటు రూ.10 లక్షలు ముట్టజెప్పాడని కాంగ్రెస్ అభ్యర్ధి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశిస్తూ ఆ స్థానంలో ఎన్నికను నిలిపివేసింది.

Related posts