telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అదరగొట్టిన ఇండియా.. మొదటి రోజు 300/6..

చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు మొదట్లోనే షాక్ తగ్గిలింది. మ్యాచ్ రెండో ఓవర్లోనే వెనుదిరిగిన ఓపెనర్ గిల్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఒక పరుగు చేయకుండానే వికెట్ కోల్పోయిన టీం ఇండియా. అయితే గిల్ ఔట్ కావడంతో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ మంచి భాగసామ్యం నెలకొల్పాడు. కానీ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా ఔట్ అయ్యాడు. అయితే.. రోహిత్‌, రహానే జట్టుకు మంచి స్కోర్‌ను అందించారు. ఇక రెండో రోజు ఆటముగిసే సరికి టీం ఇండియా.. 88 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ 33 పరుగులు, అక్సర్‌ పటేల్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 161 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ఆ తర్వాత కాసేపటికే 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. అటు ఆల్‌ రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 13 పరుగులకు వెనుదిరిగాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీక్‌, మొయిన్‌ అలీలు రెండేసి వికెట్లు, ఒల్లీ స్టోన్‌, జో రూట్‌ చెరొక వికెట్‌ తీశారు. కాగా.. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్‌ గెలిచిన ఇంగ్లండ్‌ 1-0 తో లీడ్‌లో ఉంది.

Related posts