telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవదాస్‌ కనకాల మృతిపట్ల .. ఉపరాష్ట్రపతి, కేసీఆర్ సంతాపం..

vice president and kcr condolence to devadas

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల(74) శుక్రవారం సాయంత్రం అనారోగ్యం తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతుండడం తో ఈయన్ను కిమ్స్‌ ఆస్పత్రిలో జాయిన్ చేసారు. చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దేవదాస్‌ కనకాల మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ నటులు కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

ఉపరాష్ట్రపతి ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఎందరో అగ్రనటుల్ని తెలుగు తెరకు అందించిన వారి సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. దేవదాసు కనకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. నటన శిక్షణ సంస్థ ద్వారా ఎందరినో చిత్రపరిశ్రమకు అందించారన్నారు. దేవదాసు కనకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న సీఎం పేర్కొన్నారు. నకాల భౌతికకాయాన్ని రేపు ఉదయం 8గంటలకు మణికొండలోని ఇంటికి తెసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related posts