telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆన్లైన్ లో “అరణ్య” ?

Aranya

కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. థియేటర్లు తెరిచేందుకు బ్రేక్‌ పడటంతో దేశవ్యాప్తంగా చాలా సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. అన్ని భాషల్లో దాదాపు వందల సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వరంలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు సినిమాలు ఆన్‌లైన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధం కాగా.. వాటి రిలీజ్ డేట్‌లు కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి నటించిన “అరణ్య” (హిందీలో హాథీ మేరీ సాథీ) సినిమా నేరుగా డిజిటల్‌లో విడుదల కానుందనే ప్రచారం ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో జోరందుకుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నిర్మాత సురేష్ బాబును కలిసిందట. ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషలకు కలిపి భారీ రేటును ఇస్తామని ఆ సంస్థ భారీ ఆఫర్‌ని సురేష్ ముందు ఉంచిందట. ఈ క్రమంలో సురేష్ బాబు దర్శకనిర్మాతలను అడిగి తన నిర్ణయం చెబుతానని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఓటీటీలో విడుదల కాబోయే మొదటి పాన్‌ ఇండియా చిత్రం అరణ్య అవుతుంది. కాగా ఇందులో రానా సరసన శ్రియ పిల్గోన్కర్ నటించగా.. జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్, తిన్ను ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించగా.. ఈరోజ్‌ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో.. అరణ్యపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Related posts