telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పెళ్లిపీటలెక్కిన మరో టాలీవుడ్‌ స్టార్‌..

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్ గురించి అందరికీ బాగా తెలిసిందే. దర్శకుడు, నిర్మాత అయిన ఎంఎస్‌ రాజు కూమారుడే ఈ సుమంత్‌ అశ్విన్‌. అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో రిలీజైన తూనీగ తూనీగ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతను కేరింత, కొలంబస్‌ లాంటి విజయవంతమైన సినిమాలలో నటించాడు. ఇది ఇలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ కు చెందిన ఈ మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్ సుమంత్ అశ్విన్ ఇవాళ ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ‘తూనీగ తూనీగ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని తాజా చిత్రం ‘ఇదే మా కథ’ మార్చి 19న విడుదల కాబోతోంది.

Related posts