telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ను ఏ రోజూ కలవని వారు కూడా మాట్లాడుతున్నారు… కంగనాపై సోనూసూద్ ఫైర్

Sonu-Sood

బాలీవుడ్‌లో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత బంధుప్రీతి గురించి హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇన్‌సైడర్-అవుట్ సైడర్ అంటూ హీరోయిన్ కంగన లేవనెత్తిన అంశం గురించి అందరూ స్పందిస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కంగనా, తాప్సి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు సోనూసూద్ స్పందిస్తూ, కంగనాపై మండిపడ్డాడు. మరణించిన వ్యక్తిని అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం పోరాడటం సరైన పద్ధతి కాదని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సుశాంత్ ను ఏ రోజూ కలవని వారు కూడా అతని గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారని విమర్శించాడు. సుశాంత్ మరణం గురించి మాట్లాడుతున్న వారంతా పబ్లిసిటీ కోసమే అలా చేస్తున్నారని దుయ్యబట్టాడు. సుశాంత్ ను ఇలా వాడుకుంటున్న పద్ధతి తనకు ఆవేదన కలిగిస్తోందని చెప్పాడు.

Related posts