telugu navyamedia
సినిమా వార్తలు

“బాలీవుడ్ హీరోల బండారం బయట పెడతా”- కంగనా రనౌత్ 

Kangana Ranaut images
“మణికర్ణిక” చిత్రానికి హిందీ సినిమా రంగం తగిన మద్దతు ఇచ్చి నిలబెట్టకపోవడమే కలెక్టన్లు తగ్గడానికి కారణమని కంగనా రనౌత్ ధ్వజమెత్తింది . 1857లో ప్రధమ భారత స్వతంత్ర సంగ్రామం ప్రారంభించిన మహిళగా ఝాన్సీ రాణి చరిత్రలో మిగిలిపోయింది . వీర నారిగా, పోరాడే మహిళగా ఝాన్సీ రాణి కి మంచి పేరుంది . ఝాన్సీ రాణి కథను మణికర్ణిక పేరుతో సినిమాగా తీశారు . కంగనా రనౌత్ ఝాన్సీ రాణి పాత్రను పోషించింది . జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించాడు . ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారో వివాదాల మీద వివాదాల వలయంలో చిక్కుకుంది . 
దర్శకుడు క్రిష్ కు కంగనా కు పడలేదు . అభిప్రాయభేదాలొచ్చాయి . అలాగే సోను సూద్  కూడా కంగనా దర్శకత్వంలో పని చేయనని చెప్పాడు . నిజానికి వారిద్దరూ బాలీవుడ్ కు కొత్త . తనవల్లనే వారికి గుర్తింపు , గౌరవం . అలాంటివారు తనని టార్గెట్ చేస్తారా ? వారు లేకపోతే సినిమా ఆగిపోతుందా ? కంగనా సత్తా ఏమిటో చూపిస్తా నని శపథం చేసింది . ఇక షూటింగ్ సమయంలో కూడా సహా నటులతో కంగనాకు పడలేదు . ప్రాజెక్ట్ నుంచి అర్ధతరంగా క్రిష్ వెళ్ళిపోయాక కంగనా దర్శకత్వ భాద్యత స్వీకరించింది . 
అష్ట కష్టాలకు ఓర్చి సినిమా పూర్తి చేసింది . ఈ సినిమాకు 125 కోట్ల రూపాయల వ్యయం అయ్యిందని నిర్మాతలు పేర్కొన్నారు . జనవరి 25న సినిమా విడుదల అయ్యింది . చూసినవారంతా బాగుందని ప్రశంసించారు . మొదటివారంలో 61. 15 కాగా రెండవ వారంలో 12. 50 కోట్లు వసూలు చేసింది . సోమవారంనాడు 2.25  కోట్లువసూలు  చేయగా మంగళ వారం నాడు 2. 05 కోట్లు చేసింది . అంటే ఇప్పటివరకు  77 కోట్ల 95 లక్షలను మాత్రమే వసూలు  చేసింది . . రోజు రోజుకు కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి . 
అందుకే మొన్న ఈ సినిమాను ముంబయ్ లో హీరోలు , హీరోయినులు, దర్శకుల కోసం ప్రత్యేక షో వేసింది. అందరినీ వ్యక్తిగతంగా పిలిచింది . కానీ ఎవరు ఈ సినిమా చూడటానికి ఎవరు ముందుకు రాలేదు . దీంతో కంగనా కోపంతో బాలీవుడ్ నటీనటులను నోటికి వచ్చినట్టు  తిట్టి పోసింది . అందరి  సంగతి తనకు తెలుసునని , వారి భాగోతమంతా బయట పెడతానని మండి  పడింది . 
ఝాన్సీరాణి తన మేనత్త కాదని అందరికీ సంబందించిన రాణీ అని , అలాంటి రాణి మీద సినిమా తీస్తే సపోర్ట్ ఇవ్వరా ? ఎప్పుడో తాను  కరణ్ జోహార్ షో లో “బాలీవుడ్ బందు ప్రీతితో ” నిండిపోయిందని , బయటి వాళ్ళను రానీయడం లేదని చేసిన వ్యాఖ్య అప్పట్లో దుమారం రేపింది . దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తనని సాధిస్తున్నారని కంగనా వాపోయింది . బాలీవుడ్ లోని వారి చరిత్రలన్నీ తనకు తెలుసునని , అవకాశం వచ్చినప్పుడు బయట పెడతానని హెచ్చరించింది .

Related posts