ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా.. ఆయన కొడుకు ఉన్నా తేడా ఏమీ లేదని.. ఇన్నాళ్లు కొడుకు సీఎం అన్నారు.. ఇప్పుడు మళ్లి నేనే సీఎం అని కేసీఆర్ అంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సీఎం ఎవరు అయినా పీకేది ఏమి లేదని, బీసీలను కేసీఆర్ బానిసలు అనుకుంటున్నాడని.. సీఎం కేసీఆర్ గాంధీ కాదు కాలాంతకుడని నిప్పులు చెరిగారు. ఉప్పల్ భగాయత్ నుంచే కేసీఆర్ ను ప్రజలు భగాయిస్తారని.. పవిత్రమైన సీఎం పదవిని ఎడమకాలి చెప్పుతో పోల్చాడని..గోటితో సమానమైన పదవిలో ఎందుకు ఉన్నారని మండిపడ్డారు బండి సంజయ్. కులాలకు కేటాయించిన భూముల కు వెంటనే హద్దులు కేటాయించాలి..వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కుల సంఘాల నేతలు ఆయా కుల ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. సీఎం పిలిచి భోజనం పెట్టగానే పాలభిషేకాలు చేయడం కరెక్ట్ కాదని..సీఎంకి ఇక బడితలతో అభిషేకమే అని పేర్కొన్నారు.
previous post