telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పసిడి ధర పరుగులు.. హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,430

gold-biscuits hyd

బంగారం ధర గత కొన్ని రోజులుగాపెరుగుతుంది. మార్కెట్ లో పసిడిధర పరుగులు పెడుతుంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్ మార్కెట్లో 99.9 (24 కేరెట్) స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.44,430 పలికింది. 99.5 (22 కేరెట్) స్వచ్ఛతతో కూడిన బంగారం ధర రూ. రూ.40,730గా నమోదైంది. 24 కేరెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో గత వారం రోజుల్లోనే రూ. 1790 పెరగడం గమనార్హం.

ఈ నెల 17న మార్కెట్లో రూ.42,640 ధర పలకగా నిన్న రూ.44,430కి చేరింది. ఇక 22 కేరెట్ బంగారం ధర రూ.1580 పెరిగింది. కోవిడ్-19 కారణంగా మదుపర్లు బంగారం వైపు మళ్లడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ వంటివి ధర పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts