ఇంగ్లాండ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ 337 కే ఆల్ ఔట్ అయ్యింది. నిన్న మూడోరోజు ఆటముగిసే సరికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేయగా ఈరోజు మరో 80 పరుగులు చేసి ఆ నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో 241 పరుగుల ఆధిక్యం ఉన్న ఫాలోఆన్ చేయకుండా బ్యాటింగ్ చేయాలనుకున్న ఇంగ్లాండ్ కు భారత్ బౌలర్లు షాక్ ఇస్తున్నారు. మొదటి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీసిన అశ్విన్ ఆ తర్వాత కాసేప్పటికే మరో ఓపెనర్ ను పెవిలియన్ కు చేర్చాడు. డేనియల్ లారెన్స్ వికెట్ తీసి 300 వికెట్ల క్లబ్ లో చేరాడు ఇషాంత్ శర్మ. మళ్ళీ కొద్దిసప్పటికే అశ్విన్ బెన్ స్టోక్స్ ను వెనక్కి పంపగా బుమ్రా ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్(40) ను ఔట్ చేయడంతో 101/5 తో నిలిచింది ఇంగ్లాండ్. దాంతో మొత్తం 342 ఆధిక్యంలో ఉంది. అయితే భారత బౌలర్లు ఇంగ్లాండ్ యూ ఈ రోజు ఆల్ ఔట్ చేస్తే భారత్ కు విజయావకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి మన బౌలర్లు ఈరోజు ఇంగ్లాండ్ జట్టును పడగొట్టగలరా… లేదా అనేది.
previous post
రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు