telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆచార్య’ నుంచి త్రిష తప్పు కోవడంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

chiru

‘ఆచార్య’ మూవీ నుంచి త్రిష తప్పుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిష తప్పుకుందని తెలిశాక నేను షాక్‌కు గురయ్యా. త్రిష ఏమైనా ఇబ్బందికి గురైందా అని మూవీ యూనిట్‌ని అడిగి తెలుసుకున్నా. త్రిష కోసం నా కుమార్తె సుష్మిత ఔట్‌ఫిట్లను కూడా సిద్ధం చేసింది. అయితే ఆ తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే. మణిరత్నం సినిమాను ఒప్పుకున్న త్రిష.. ఆ ప్రాజెక్ట్‌కు చాలా రోజులను కేటాయించింది. అందుకే ఆమె నా చిత్రం నుంచి తప్పుకుంది. మా టీమ్‌తో ఎవరికీ త్రిషతో ఎలాంటి ఇబ్బంది లేదు అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చెర్రీ నటించనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Related posts