టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అంటూ బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ ఒక లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ను ఆ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో హీరో మహేష్ బాబుకు నెంబర్ వన్ ప్లేస్ దక్కగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు 4వ స్థానం దక్కింది. ఒర్మాక్స్ అనే మీడియా సంస్థ టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ హీరోలపై సర్వే నిర్వహించిందట. ఈ సర్వే ప్రకారం ఒర్మాక్స్ విడుదల చేసిన టాప్ 10 హీరోల లిస్ట్ ఇలా ఉంది. 1. మహేష్ బాబు, 2. అల్లు అర్జున్, 3. ప్రభాస్, 4. పవన్ కల్యాణ్, 5. ఎన్టీఆర్, 6. చిరంజీవి, 7. రామ్ చరణ్, 8. నాని, 9. విజయ్ దేవరకొండ, 10. వెంకటేష్. హీరోకి దక్కిన విజయాలు.. అలాగే కలెక్షన్స్ ఆధారంగా ప్లేస్‌లు నిర్ణయించే ఈ సంస్థ.. మార్చి నెలకు సంబంధించి ఈ సర్వేను నిర్వహించిందట.
previous post