telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చెన్నై ఎక్స్‌ప్రెస్” ఆఫర్ రిజెక్ట్ చేసిన నయన్… అతడే కారణమట…!!

Nayan

విభిన్నమైన పాత్రలతో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది నయనతార. అయితే తాజాగా నయన్ కు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌తో పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార మాత్రం షారూక్ ఆఫర్‌ను తిరస్కరించిందట. “చెన్నై ఎక్స్‌ప్రెస్” సినిమాలో మెరిసే అవకాశాన్ని వదులుకుందట. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయన్ చేత “చెన్నై ఎక్స్‌ప్రెస్”లో ఓ ప్రత్యేక గీతం చేయించాలని షారూక్ ప్లాన్ చేశారట. నయన్‌ను కలిసి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయితే ఆ పాట చేసేందుకు నయన్ అంగీకరించలేదట. తన మాజీ ప్రేమికుడు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తుండడం వల్లే ఆ పాటను నయన్ తిరస్కరించిందట. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Related posts