‘బద్రి’ మూవీ 20 ఇయర్స్ పూర్తిచేసుకోవడం మరోసారి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది రేణుదేశాయ్.సరిగ్గా 20 ఏళ్ల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా ‘బద్రి’ సినిమా రిలీజై సంచలనాలు సృష్టించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కాసేపు వీడియో చాట్ చేసిన రేణుదేశాయ్. పూరి జగన్నాథ్ ఓ బ్రిలియంట్ రైటర్ అంటూ కితాబు ఇచ్చింది రేణు దేశాయ్. ఎలాంటి ఆడిషన్స్ తీసుకోకుండా నన్ను నమ్మి వెన్నెల రూపంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నా. కాకపోతే ఆ సినిమాలో అదే మెయిన్ రోల్ అని చెప్పి దొంగ పని చేశారు. అయితే మీరు బద్రి సినిమాలో ఆ రోల్ రాశారు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే కళ్యాణ్ గారిని కలిశాను. ప్రపంచంలోనే ఎంతో విలువైన ఇద్దరు పిల్లలకు తల్లయ్యాను. అవి నా చిన్నారి దేవతలు అఖీరా, ఆద్యా` అని రేణు పేర్కొన్నారు. ఇదంతా మీరు సృష్టించిన ఆ క్యారెక్టర్ వల్లే జరిగింది. అందుకే నా జీవితంలో మీరు చాలా చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పింది రేణుదేశాయ్.