telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై విజయమ్మ క్లారిటీ

YS Vijayamma Clarity Contest  Elections 
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై  వైఎస్ విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన నిర్ణయాన్ని  వెల్లడించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని  విజయమ్మ స్పష్టం చేశారు.
తన కుమారుడు జగన్ అవసరమనుకుంటే మాత్రం ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆమె పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. 
ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. జగన్ పై దాడి విషయాన్ని అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు.ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు.
జగన్ పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను పరిణామాలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమ పార్టీకి 120 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Related posts