telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు… టైమ్ టేబుల్ ప్రకటించిన తెలంగాణ సర్కారు

Online

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా గత కొన్నాళ్లుగా స్కూళ్ళు మూతబడిన విషయం తెలిసిందే. కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 3వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామంటూ సెప్టెంబర్ 14వ తేదీ వరకు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఇక, 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒక్కో క్లాస్ టైం 30 నిమిషాలు అంత కన్నా తక్కువే.. ఉండే విధంగా ప్లాన్ చేశారు. ప్రతీ విద్యార్థికి క్లాసెస్ రీచ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అందరు విద్యార్థులు ఈ ఆన్‌లైన్‌ క్లాసులను ఉపయోగించుకునేల చూసే బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేసింది ప్రభుత్వం. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ బాధ్యత తీసుకోవాలని సర్కార్ తెలిపింది. ఇప్పటికే సీబీఎస్‌ఈ స్కూళ్లు, మరికొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Related posts