telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందరికీ అనువైన హెల్త్‌కేర్‌ పాలసీ తీసుకురానున్నాం : ఉపాసన

Upasana

మెగాస్టార్‌ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్‌ కవరేజ్‌ మోడల్‌ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన ట్వీట్‌ చేశారు. “అందరికి అనువైన ఆరోగ్య సంరక్షణ… 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్‌కేర్‌‌ కవరేజ్‌ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జై హింద్”‌ అంటూ ఉపాసన ట్వీట్‌ చేయడమే కాక ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో “దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికి అనువైన హెల్త్‌కేర్‌ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నాం” అంటూ ఇన్యూరెన్స్‌ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్‌ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది” అన్నారు. ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ (ఎఫ్‌హెచ్‌పఎల్), 1995లో విలీనం చేయబడింది. 2002 లో ఐఆర్‌డీఏ లైసెన్స్ పొందింది. నేడు దేశంలో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ పొందిన ఐఆర్‌డీఏ లైసెన్స్‌ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌లలో ఎఫ్‌హెచ్‌పఎల్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఉండగా దేశవ్యాప్తంగా 55కు పైగా స్థానాల్లో, 25 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. వ్యక్తిగత కస్టమర్లు, కార్పొరేట్ ఖాతాదారులకు, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య పథకాలకు ఆరోగ్య బీమా ప్రయోజనాల పరిపాలన అవసరాలను ఎఫ్‌హెచ్‌పీఎల్‌ అందిస్తోంది. నాణ్యత ప్రమాణాలు, ప్రక్రియల కోసం ఐఎస్‌ఓ 9001: 2008 తో ధృవీకరించబడిన మొదటి లైసెన్స్ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ కావడం విశేషం. 

Related posts