telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్న రాఫెల్‌!

Rafel jet

సరిహద్దుల్లో కయ్యనికి కాలుదువ్వుతున్న శత్రు దేశాలకు చెక్ పెట్టేందుకు భారత్ ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో అత్యాధునిక 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌కు చేరనున్నాయి. చైనా స్వయంగా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20, చైనాలో తయారై పాక్‌ వాయుసేనకు చేరిన జేఎఫ్‌-17తో పోలిస్తే రాఫెల్‌ పలు విషయాల్లో మెరుగైనదని సైనిక నిపుణులు చెబుతున్నారు.

ఫ్రాన్స్‌నుంచి రాఫెల్‌ విమానాల రాక నేపథ్యంలో అంబాలాలోని వైమానిక స్థావరం పరిసర ప్రాంతాల్లో మంగళవారం నిషేధాజ్ఞలు విధించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. వైమానిక స్థావరానికి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు డ్రోన్లను అనుమతించబోమని అంబాలా జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

Related posts